older posts

Sunday, 26 October 2014

ఇలా విప్పొచ్చు చిక్కుముళ్ళు!

అనుకోకుండా క్లాస్ టెస్టు రేపు జరగబోతోంది. రన్నింగ్ క్లాస్ నోట్సేమో నా క్లాస్‌మేట్ దగ్గరుంది. అతడు ఇవాళ కాలేజీకి రాలేదు. తన ఇంటి అడ్రసేమిటో కూడా తెలీదు... ఇప్పుడేం చేయాలి ?¤   ముఖ్యాంశాలూ, సిలబస్ పరిధి బయట అదనపు సమాచారం మాత్రమే రాసుకునేది రన్నింగ్ నోట్సు. మరో క్లాస్‌మేట్ దగ్గర కూచుని ముఖ్యాంశాలను కాపీ చేసుకోవటం అత్యంత సరళ పరిష్కారం. నోట్సు సంగతి మర్చిపోయి, కోర్సు పుస్తకం చదువుకోవటం మరో తేలిక మార్గం.
           ఇక్కడ గమనించాల్సింది... లేనిదాని గురించి బాధపడిపోవటం కంటే- వివేకంతో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవటం
!
ఒక ప్రతిష్ఠాత్మక బహుళజాతి సంస్థలో ఎంట్రీ స్థాయి ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతోంది. లోపలికి వెళ్ళడానికి పిలుపు కోసం లాబీలో ఎదురుచూస్తున్నాను. ఇంతలో- ఓ ముఖ్యమైన సర్టిఫికెట్‌కు ఫొటో కాపీ లేదని అప్పుడే గమనించాను.... ఏమిటి కర్తవ్యం¤   ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు చేయగలిగిందీ ఏమీ ఉండదు కాబట్టి నిబ్బరంగా ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరై ప్రతిభ చూపించాలి. ఫొటో కాపీ కోసం అడిగితే వెంటనే క్షమాపణ చెప్పి, కొద్ది నిమిషాల్లో కాపీ తీసి, సమర్పిస్తానని అభ్యర్థించాలి. సర్టిఫికెట్ కాపీని వాళ్ళసలు అడగనే లేదనుకోండీ, ఇబ్బందే లేదు కదా ?
హఠాత్తుగా మేనేజర్ పిలిచారు. మా సీనియర్‌కు ఆరోగ్యం సరిగా లేక ఇవాళ ఆఫీసుకు రాలేదట. అతడికి బదులుగా ప్రాజెక్టు సమీక్షా సమావేశానికి ప్రాతినిథ్యం వహించాలని మేనేజర్ నన్ను ఆదేశించారు. ఆ సమావేశం మొదలవ్వటానికి ఇంకా రెండు గంటల వ్యవధి కూడా లేదు. ... ఎలా ఇప్పుడు¤   మేనేజర్‌ను 'focus areas' ఏమిటో అడగాలి. గత రెండు మూడు సమావేశాల మినిట్స్‌ను చదివితే, సబ్జెక్టు మీద సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఏవి మాట్లాడాలో, ఏవి కూడదో మేనేజర్‌ను అడిగి స్పష్టత ఏర్పరచుకోవాలి. సమావేశం ఆరంభంలో 'మరొకరి బదులు వచ్చానని చెప్పటం ద్వారా సభ్యుల అంచనాలు పెరక్కుండా చూసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఓ తేలిక పరిష్కారం- సభ్యులు అడగదల్చిన ప్రశ్నలు చెపితే నోట్ చేసుకుంటాననీ, సీనియర్ రాగానే వాటికి ఈ-మెయిల్స్ ద్వారా సమాధానం ఇస్తారనీ చెప్పటం!

No comments:

Post a Comment